ఏపీ ప్రజల కోరికలకు భిన్నంగా వింత ప్రకటనలు చేస్తున్నారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
- ఉత్తరాంధ్ర ప్రజలను అపహాస్యం చేస్తున్నారు
- జగన్ కూడా వంత పాడుతున్నారు
- మోదీ మరోసారి మోసం చేశారు
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వాల్తేరు డివిజన్ను తీసేసి విశాఖ జోన్ ప్రకటించడమంటే ఉత్తరాంధ్ర ప్రజలను అపహాస్యం చేయడమేనన్నారు. రైల్వే జోన్ విషయంలో ప్రధాని మోదీ మరోసారి మోసం చేశారన్నారు. విశాఖ జోన్ విషయంలో జగన్ కూడా వంత పాడుతున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఏపీ ప్రజలు కోరికలకు భిన్నంగా మోదీ వింత ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దీక్షలో టీడీపీ ఎమ్మెల్యేలు కలమట వెంకట రమణ, బెందాళం అశోక్ పాల్గొన్నారు.