అప్పుడు ‘ఓటుకు నోటు’ కేసులో దొరికారు.. ఇప్పుడు ‘క్యాష్ ఫర్ ట్వీట్’లో అడ్డంగా బుక్కయ్యారు!: చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు
- తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారు
- నకిలీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఇందుకు కొనుగోలు చేశారు
- మీకు ఓటేయాల్సింది ప్రజలేనని గుర్తుపెట్టుకోండి
కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పెయిడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా టీడీపీ అధినాయకత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తోంది. చంద్రబాబు గారూ.. మీరు నకిలీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కొనుగోలు చేయవచ్చు. కానీ ఎన్నికల్లో మీకు ఓటేయాల్సింది మాత్రం నిజమైన ప్రజలేనని గుర్తుపెట్టుకోండి. ఓసారి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. ఇప్పుడు మళ్లీ క్యాష్ ఫర్ ట్వీట్ వ్యవహారంలో అడ్డంగా దొరికారు’ అని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ కు ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని జతచేశారు.