kidari sarveswararao: కిడారి, సోమలను చంపడానికి కారణమిదే: మావోయిస్టు నేత గణేష్

  • ఆదివాసీలకు ద్రోహం చేశారు
  • జైల్లో ఉంచి వేధించారు
  • సామ్రాజ్యవాదులకు ఏజెంట్లుగా మారారు
ఆదివాసీలకు ద్రోహం చేస్తూ, సామ్రాజ్యవాదులకు ఏజెంట్లుగా మారినందుకే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలను హతమార్చామని ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన నుంచి విశాఖ మీడియా ప్రతినిధులకు ఓ లేఖ అందింది. టీడీపీలో చేరిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారని లేఖలో పేర్కొన్నారు. ఆదివాసీలపై కక్షగట్టి వారిని 5 నెలలుగా జైల్లో ఉంచి వేధించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి అక్రమ అరెస్టులను నిలిపివేయాలని... లేకపోతే స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
kidari sarveswararao
soma
Telugudesam
murder
maoist
ganesh
iob

More Telugu News