తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో యుద్ధం.. ‘డేటా గ్రిడ్’కు మద్దతుగా మూడు రాష్ట్రాల నుంచి ట్వీట్లు!
- విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్కారు
- లోతుగా విచారించాలని పోలీసులకు ఆదేశం
- ముంబై, పూణే, బెంగళూరు, రాజస్థాన్ నుంచి ట్వీట్ల దాడి
కాగా, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ట్వీట్ల సంగతి ఏంటో చూడాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. కాగా ఏపీ-తెలంగాణ మధ్య వ్యవహారంపై ముంబై, బెంగళూరు, పూణే, రాజస్థాన్ నుంచి ట్వీట్లు రావడంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ ప్రజల సమాచారాన్ని అక్రమంగా సేకరించారని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2న సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ డైరెక్టర్ అశోక్ పరారీలో ఉన్నారు.