Andhra Pradesh: టీడీపీ ప్రభుత్వంలో శిలాఫలకాలు కూడా తాత్కాలికమే.. ఫొటోను పోస్ట్ చేసిన కన్నా!

  • టీడీపీ అంటే తాత్కాలిక అభివృద్ధి-శాశ్వత అవినీతి
  • అసెంబ్లీ, రాజధాని, ప్రభుత్వం అంతా తాత్కాలికమే
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఏపీ బీజేపీ చీఫ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం అంటే ‘తాత్కాలిక అభివృద్ధి-శాశ్వత అవినీతి’ అని దుయ్యబట్టారు. ఏపీలో అసెంబ్లీ, ప్రభుత్వం, రాజధాని, శిలాఫలకాలు.. ఇలా అన్నీ తాత్కాలికమేనని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కన్నా ట్విట్టర్ లో టీడీపీపై తీవ్రంగా మండిపడ్డారు.
కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ఏపీ లో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం..తాత్కాలిక రాజధాని.. తాత్కాలిక సెక్రటేరియట్.. తాత్కాలిక అసెంబ్లీ.. తాత్కాలిక శంకుస్థాపనలు.. తాత్కాలిక శిలాఫలకాలు.. రాష్ట్రం రాబోయే దశాబ్దంలో కూడా కోలుకోలేనంత శాశ్వత అవినీతి’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఓ శిలాఫలకాన్ని స్టాండ్ పై ఏర్పాటు చేసిన క్లిప్ ను కన్నా పోస్ట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
BJP
kanna
Twitter

More Telugu News