karate kalyani: కొంతమంది నన్ను కావాలని ఇరికించారు: నటి కరాటే కల్యాణి

  • ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది
  • కొంతమంది బురదజల్లుతున్నారు
  •  ధైర్యంతో ముందడుగు వేశాను
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని విషయాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో కరాటే కల్యాణి ముందువరుసలో ఉంటారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఇదే విషయం ప్రస్తావనకు రాగా, కరాటే కల్యాణి తనదైన శైలిలో స్పందించారు. "నాకు అన్నం పెట్టిన ఇండస్ట్రీపై కొంతమంది బురదజల్లుతున్నారు. అనవసరమైన విషయాలను సంబంధంలేని వారిపైకి నెడుతున్నారు.

జరుగుతున్నది చూస్తూ కూర్చోకుండా ఎవరో ఒకరు ముందుకు రావాలి గదా .. అందుకే నేను అడుగు ముందుకు వేశాను. కానీ చాలామంది మనకెందుకులే అని తప్పించుకుపోయారు. నేను ముందుకు వెళ్లడం వలన నాపై కేసులు మోపబడ్డాయి .. నిజం చెప్పాలంటే అనవసరంగా ఇరుక్కున్నాను. కొంతమంది వాళ్ల స్వార్థ ప్రయోజనాల కోసం ఇరికించారు. నా ధైర్యం చూసి మెచ్చుకున్నవారు వున్నారు .. ఈవిడకి ఇవన్నీ అవసరమా? అనుకున్నవారూ వున్నారు" అంటూ చెప్పుకొచ్చారు. 
karate kalyani
ali

More Telugu News