అజ్ఞాతంలోకి ‘ఐటీ గ్రిడ్’ డైరెక్టర్ అశోక్.. ప్రత్యేక బృందాలతో జల్లెడ పడుతున్న సైబరాబాద్ పోలీసులు!
- తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన అశోక్
- పిటిషన్ ను కోర్టు కొట్టేయడంతో అజ్ఞాతంలోకి
- ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సైబరాబాద్ పోలీసుల మీడియా సమావేశం
ఈ నేపథ్యంలో అశోక్ ను ప్రశ్నించేందుకు పోలీసులు యత్నించగా, ఆయన అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కావలి, బెంగళూరులో గాలింపును ముమ్మరం చేశారు. మరోవైపు ఈ కేసులో ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.