ఏడాదిన్నర క్రితమే ప్లాన్ చేశారు.. తన ఓటును తొలగించడంపై వైఎస్ వివేకా ఆగ్రహం!
- 50 లక్షల వైసీపీ ఓట్లను తొలగిస్తున్నారు
- వారిపై చర్యలు తీసుకోండి
- పులివెందుల పోలీస్ స్టేషన్ లో వివేకా ఫిర్యాదు
ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. ప్రజల ఓట్లను తొలగించిన విషయంలో ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని వైఎస్ వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు.