Mahanayakudu: పోస్టర్ల ఖర్చులు కూడా రానంతగా అట్టర్ ఫ్లాప్ అయింది బాబూ!: 'మహానాయకుడు'పై విజయసాయి సెటైర్లు!

  • 'మహానాయకుడు' సినిమాను మోదీ చూడాలన్న చంద్రబాబు
  • వెన్నుపోటు చరిత్రను వక్రీకరించడానికి సినిమాలు తీసి హింసించాలా?
  • ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసిన విజయసాయి
1982-84 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించానో తెలియాలంటే, నరేంద్ర మోదీ 'మహానాయకుడు' చిత్రాన్ని చూడాలని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడంపై, కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ ఉదయం ట్విట్టర్ వేదికగా ట్వీట్లు పెడుతూ, "మహానాయకుడు సినిమా చూస్తే తనేమిటో ప్రధానికి తెలుస్తుందట. మీ అవినీతి వివరాలన్నీ తన దగ్గరున్నాయని ప్రధాని చెప్పారు కదా? వెన్నుపోటు చరిత్రను వక్రీకరించడానికి సినిమాలు తీసి హింసించాలా? జనాలు నమ్మకే పోస్టర్ల ఖర్చులు కూడా రానంతగా అట్టర్ ఫ్లాప్ అయింది బాబూ!" అని ఎద్దేవా చేశారు.

ఆ వెంటనే మరో ట్వీట్ ను పెడుతూ "ఎక్కడన్నా దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ఉంటారు. ఏపీలో మాత్రం... దొంగల్ని (బాబు, లోకేష్, దేవినేని, చింతమనేని, ప్రత్తిపాటి, సీఎం రమేష్, ఎట్సెట్రాల్ని) రక్షించడానికే పోలీసులు ఉపయోగపడుతున్నారు" అని అన్నారు.






Mahanayakudu
Chandrababu
Vijaysai Reddy
Movie
Narendra Modi

More Telugu News