Bihar: దశాబ్దం తరువాత ఒకే వేదికపై నరేంద్ర మోదీ, నితీశ్ కుమార్!

  • నేడు పట్నాలో భారీ ర్యాలీ
  • పాల్గొననున్న మోదీ, నితీశ్
  • 5 లక్షల మందిని తరలించాలని బీజేపీ నిర్ణయం
మే 2009 తరువాత నేడు బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లు కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు. నేడు మోదీ బీహార్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, పట్నాలో భారీ ర్యాలీ నిర్వహించనుండగా, ఆపై జరిగే బహిరంగ సభలో నితీశ్ కూడా పాల్గొననున్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలను తరలించాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకుంది.

నవంబర్ 2005లో బీహార్ లో జేడీ (యూ), బీజేపీలు కలిసి ర్యాలీ నిర్వహించగా, ఆపై మరెన్నడూ రెండు పార్టీలూ కలిసి ప్రచారం చేయలేదు. రెండేళ్ల క్రితం ఆర్జేడీకి టాటా చెప్పిన నితీశ్, బీజేపీ సహకారంతో సీఎంగా కొనసాగుతూ వస్తుండగా, మోదీతో కలిసి ఏ బహిరంగ సభలోనూ పాల్గొనలేదు. ఇక అక్టోబర్ 2013 తరువాత బీహార్ లో నరేంద్ర మోదీ ర్యాలీ నిర్వహిస్తుండటం ఇదే తొలిసారి. గాంధీ మైదాన్ ఈ సభకు వేదిక కానుంది.
Bihar
Narendra Modi
Nitish Kumar

More Telugu News