Andhra Pradesh: కులగజ్జిలో చిక్కుకున్నవారికి అందరూ అలాగే కనిపిస్తారు!: ఏపీ సీఎం, లోకేశ్ పై విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ఓటమికి చంద్రబాబు, లోకేశ్ సాకులు వెతుక్కుంటున్నారు
  • ప్రశాంత్ కిశోర్ కూడా కలలోకి వస్తున్నాడా?
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై విరుచుకుపడ్డారు. మరో రెండు నెలల్లో ఎదురుకాబోయే ఓటమికి తండ్రీకొడుకులు సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.

బీహార్ ముఠా అనీ, కుల విభజన అని టీడీపీ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు టీడీపీ నేతలకు ప్రశాంత్ కిశోర్ కూడా కలలోకి వస్తున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కులగజ్జిలో చిక్కుకున్నవారికి అందరూ ఇలాగే కనిపిస్తారని సెటైర్ వేశారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మరో రెండు నెలల్లో ఎదురయ్యే ఓటమికి తండ్రీకొడుకులు సాకులు వెతుక్కుంటున్నారు. బీహార్ ముఠా అనీ, అక్కడి కుల విభజనలను ఇక్కడ సృష్టించాలని చూస్తున్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిశోర్ కూడా కలలోకి వస్తున్నాడా? కులగజ్జిలో చిక్కుకున్న వారికి అందరూ అలాగే కనిపిస్తారు’ అని ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Jagan
Chandrababu
Vijay Sai Reddy
Nara Lokesh

More Telugu News