చంద్రబాబు పీడ పోతే... మరుక్షణం ప్రత్యేక హోదా: రోజా
- చంద్రబాబునాయుడు ఓ చీడపురుగు
- ఆయన ఏపీని వదిలితే వెంటనే హోదా
- పుత్తూరులో వైసీపీ మహిళా నేత రోజా
నిరాహార దీక్షలు, ధర్నాలతో వైసీపీ ఒత్తిడి తేవడంతోనే జోన్ కల సాకారమైందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే, కొన్ని రోజుల్లోనే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని ఆమె అన్నారు. "రాజన్న బిడ్డ జగన్ మోహన్ రెడ్డి, అమరావతిలో అడుగుపెట్టగానే, మరి వైజాగ్ కు రైల్వే జోన్ వచ్చింది. ఏపీని చంద్రబాబు వదిలిపోతే, ప్రత్యేక హోదా కూడా వస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు" అని ఆమె అన్నారు.