అభినందన్‌ను మించిన హీరోను ఈ భూమ్మీద ఇప్పటి వరకు చూడలేదు: టీమిండియా బౌలర్ అశ్విన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభినందన్‌ను మించిన హీరోను ఈ భూమ్మీద ఇప్పటి వరకు చూడలేదు: టీమిండియా బౌలర్ అశ్విన్

  • మూడు రోజులు పాక్ చెరలో ఉన్న భారత పైలట్
  • ఇలాంటి హీరో లేడంటూ ప్రశంస 
  • ‘అభినందన్‌కు స్వాగతం’ అంటూ ట్వీట్
పాకిస్థాన్ చెరలో మూడు రోజులు గడిపి స్వదేశానికి చేరుకున్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్‌ భారత గడ్డపై తిరిగి కాలుపెట్టాక యావత్ భారతావని పులకించింది. అభినందన్‌కు స్వాగతం పలుకుతూ దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ట్వీట్లు చేశారు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేస్తూ.. తన జీవితంలో ఇప్పటి వరకు అభినందన్ లాంటి హీరోను ఈ భూమిపై చూడలేదని పేర్కొన్నాడు. ‘అభినందన్‌కు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశాడు.  

పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను తరుముకుంటూ వెళ్లిన అభినందన్ తన మిగ్ విమానం కూలిపోవడంతో సురక్షితంగా ల్యాండయ్యాడు. అయితే, అతడు దిగింది పాక్ భూభాగం కావడంతో ఆ దేశ సైనికులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ దౌత్యపరంగా చేసిన ఒత్తిడితో దిగొచ్చిన పాక్ శుక్రవారం అభినందన్‌ను భారత్‌కు అప్పగించింది.
Abhinandan
IAF pilot
India
Team India
Ravichandran Ashwin

More Telugu News