అభినందన్ విడుదల నేపథ్యంలో.. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దు చేసిన బీఎస్ఎఫ్!
- వాఘా-అట్టారికి భారీగా చేరుకున్న ప్రజలు
- ఇలాంటి పరిస్థితిలో కార్యక్రమాన్ని నిర్వహించలేమన్న బీఎస్ఎఫ్
- అట్టారి సరిహద్దుకు చేరుకున్న ఐఏఎఫ్ అధికారులు, కుటుంబ సభ్యులు
మరోవైపు అభినందన్ విడుదలకు సంబంధించిన పత్రాలను పాకిస్థాన్ లోని భారత హైకమిషన్ దాయాది దేశానికి అప్పగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అభినందన్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు వాయుసేనతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు భారతీయులు భారీ సంఖ్యలో సరిహద్దుకు చేరుకున్నారు. కాగా, మిలటరీ ప్రోటోకాల్ నేపథ్యంలో తాను అభినందన్ కు స్వాగతం పలికేందుకు వెళ్లడం లేదని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.