ధనుశ్ మూవీలో సాయిపల్లవి చెల్లి నటించడం లేదట!

  • సాయిపల్లవికి మంచి క్రేజ్ 
  • మెడిసిన్ చదువుతోన్న పూజా కన్నన్
  • నటన వైపుకు వచ్చే ఉద్దేశం లేదు    
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. నటన పరంగా .. డాన్స్ పరంగా ఈ అమ్మాయి మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉందనే సంగతి తెలిసిందే. ధనుశ్ .. పూజా కన్నన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో పూజా కన్నన్ కూడా నటనవైపుకు వచ్చిందనీ, ధనుశ్ జోడీగా తొలి సినిమా చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ధనుశ్ .. పూజా కన్నన్ సరదాగా ఆ ఫొటో దిగారట .. అంతే. ప్రస్తుతం పూజా కన్నన్ మెడిసిన్ చదువుతోందట. చదువుపైనే పూర్తి దృష్టి పెట్టిందనీ, నటనవైపుకు వచ్చే ఉద్దేశం ఆమెకి లేదని అంటున్నారు. దాంతో పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారానికి తెరపడిపోయింది.
Go Back to Shorts
dhanush
pooja kannan

More Telugu News