Andhra Pradesh: తెలుగోడికి పుట్టినోడెవడూ మోదీ మీటింగ్ కు వెళ్లరు: మంత్రి అయ్యన్నపాత్రుడు

  • ఏపీకి ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదు
  • మోదీకి సిగ్గు, లజ్జ.. ఉంటే ఏపీకి ఏం చేశారో చెప్పాలి?
  • ఏదో సాధించినట్టుగా బీజేపీ నేతలు సంబరాలు!
తెలుగోడికి పుట్టినోడెవడూ నేడు విశాఖలో జరగనున్న ప్రధాని మోదీ మీటింగ్ కు వెళ్లరని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ మోదీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీకి సిగ్గు, లజ్జ.. ఉంటే కనుక ఏపీకి ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదో సాధించినట్టుగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబం గురించి మోదీ మాట్లాడటమా? అంటూ ఓ స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వైసీపీని కూడా ఆయన వదల్లేదు. ఢిల్లీలోనో, తెలంగాణాలోనే స్విచ్ వేస్తే తప్ప ‘ఫ్యాన్’ తిరగదంటూ ఆ పార్టీపై విమర్శలు చేశారు.
Andhra Pradesh
minister
Ayyanna Patrudu
Telugudesam
bjp
modi
pm
YSRCP
jagan

More Telugu News