India: భారత్-పాక్ సరిహద్దుల్లో ఇంకా కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం

  • అఖ్నూర్, పలన్ వాలా తదితర ప్రాంతాల్లో పాక్ కవ్వింపు  
  • సమర్థంగా తిప్పికొడుతున్న భారత సైన్యం
  • సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను భద్రతా బలగాలు రక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అఖ్నూర్, పలన్ వాలా, నౌషెరా, రాజౌరీ తదితర ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. స్థానిక ప్రజలను బంకర్లు, సురక్షిత ప్రాంతాలకు సైన్యం తరలిస్తోంది. సరిహద్దు గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఆసుపత్రి భవనాలపై ముందస్తు జాగ్రత్తగా అధికారులు ‘రెడ్ క్రాస్’ గుర్తు వేశారు.
India
Pakistan
rajouri
akhnur
palan wala

More Telugu News