సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- తెలుగులో అనుపమ మరో చిత్రం
- శ్రీవాస్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- ప్రిన్స్ కథానాయకుడిగా 'రాడికల్'
* తాజాగా '118' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నందమూరి కల్యాణ్ రామ్ మరో చిత్రానికి ఓకే చెప్పాడు. 'సాక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
* 'సూపర్ స్టార్ కిడ్నాప్' ఫేం సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రిన్స్ కథానాయకుడుగా 'రాడికల్' పేరిట ఓ ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం రెండో షెడ్యూలు ఈ నెల 18 నుంచి హైదరాబాదులో జరుగుతుంది.