నేడు విశాఖకు మోదీ.. కొత్త వరాలు గుప్పిస్తారా?
- నేడు విశాఖపట్టణంలో మోదీ బహిరంగ సభ
- ప్రధాని రాకపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న టీడీపీ
- నల్లజెండాలతో నిరసన తెలపనున్న విభజన హామీల సాధన సమితి
మరోవైపు, విభజన హామీలు నెరవేర్చకుండా ఏపీలో మోదీ ఎలా అడుగుపెడతారంటూ టీడీపీ విరుచుకుపడుతోంది. ‘మోదీ గో బ్యాక్’ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో పలువురు నిరాహారదీక్షకు దిగారు. అలాగే, మోదీకి దారి పొడవునా నల్లజెండాలతో నిరసన తెలియజేయనున్నట్టు సాధన సమితి తెలిపింది.