Chennai: శునకంపై అత్యాచారం... సీసీటీవీ ఫుటేజ్ చూసి పోలీసుల అవాక్కు!

  • చెన్నైలో ఘటన
  • కుక్కను బలవంతంగా తీసుకెళ్లిన యువకుడు
  • జంతు సంఘాల ఫిర్యాదుతో కేసు నమోదు
ఓ టీస్టాల్ లో పని చేస్తున్న కార్మికుడు, వీధి కుక్కపై అత్యాచారం చేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన చెన్నైలో జరిగింది. జంతు సంరక్షణ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, కుక్కపై అత్యాచారం జరిగిన విషయం వాస్తవమేనని తేల్చి అవాక్కై, కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగిందని, బలవంతంగా శునకాన్ని తీసుకుని యువకుడు వెళుతుండగా, స్థానికుడు చూశాడని, అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యాడని, ఆపై దానిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Chennai
Dog
Rape

More Telugu News