America: శాంతి.. సహనం పాటించండి: భారత్-పాక్‌లను కోరిన అమెరికా

  • రంగంలోకి అమెరికా
  • ఇరు దేశాలకు ఫోన్
  • ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచన
భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అమెరికా రంగంలోకి దిగింది. భారత్-పాక్‌లకు ఫోన్ చేసిన అమెరికా ప్రభుత్వం ఇరు దేశాలు సంయమనం పాటించాలని, మిలటరీ చర్యలను నిలుపుదల చేయాలని సూచించింది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలను తక్షణం తీసుకోవాలని కోరింది. ఇందులో భాగంగా ఇరు దేశాలు నేరుగా మాట్లాడుకోవాలని సూచించింది.

ఇటీవల భారత సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి వంటి సీమాంతర ఉగ్రవాదం ప్రాంతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పాక్‌కు ఫోన్ చేసి చెప్పామని, ఉగ్రవాదులకు తమ భూభాగాన్ని స్వర్గధామంగా మార్చొద్దని, వారి నిధుల సరఫరాకు అడ్డుకట్ట వేయాలని పాక్‌కు సూచించినట్టు అమెరికా ప్రభుత్వం పేర్కొంది.
America
Donald Trump
India
Narendra Modi
Pakistan
Imran khan

More Telugu News