Tirupati: తిరుపతి కపిలేశ్వర స్వామికి అపచారం... ఊరేగింపు మధ్యలో నిలిపివేత!

  • మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న ఊరేగింపు
  • భారీ వర్షంతో భక్తుల ఇబ్బందులు
  • పటాటోపం లేక అప్రదక్షిణంగా ఆలయంలోకి ఉత్సవమూర్తి
తిరుమల గిరులకు కిందగా, తిరుపతిలో వేంచేసివున్న ప్రముఖ శైవాలయం కపిలేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అపశ్రుతి దొర్లింది. నిన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా, స్వామివారి ఊరేగింపు జరుగుతున్న వేళ, భారీ వర్షం పడింది. సాధారణంగా ఊరేగింపు సమయంలో పటాటోపం (వర్షం పడితే స్వామికి రక్షణగా పట్టే గొడుగు) వెనుకనే వస్తుంటుంది. కానీ, వర్షం రాదని భావించారో ఏమో, ఆలయ అధికారులు, పటాటోపాన్ని ఊరేగింపులో భాగం చేయలేదు. ఆపై ఒక్కసారిగా వర్షం కురవడంతో, భక్తులు చెల్లాచెదరుకాగా, స్వామి ఉత్సవ విగ్రహాన్ని అప్రదక్షిణంగా తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు వర్షంలోనే స్వామిని కాసేపు ఊరేగించారని, ఇది అపచారమని భక్తులు ఆరోపించారు.
Tirupati
Kapileshwara Swamy
Rain

More Telugu News