బుద్గాంలో కూలిన చాపర్.. ఆరుగురు వాయుసేన సిబ్బంది మృతి
- ప్రమాదానికి తెలియని కారణాలు
- హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో ఉన్న ఓ పౌరుడు కూడా మృతి
- శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘటన
ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, ఎందుకు కూలిందన్న వివరాలు తెలియాల్సి ఉందని బుద్గాం అదనపు డిప్యూటీ కమిషనర్ ఖుర్షీద్ అహ్మద్ షా తెలిపారు. మృతి చెందిన వారిలో ఆరుగురు వాయుసేన సిబ్బందని, ఒకరు పౌరుడని పేర్కొన్నారు. పౌరుడి పేరు కిఫాయత్ అహ్మద్ గనై అని, చాపర్ కూలిన ప్రాంతంలో ఉండడంతో ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు.