Asaduddin Owaisi: పైలెట్ విషయంలో పాక్ మానవత్వంతో మెలగాలి: అసదుద్దీన్

  • కష్ట సమయంలో పైలెట్‌ కోసం ప్రార్థిస్తున్నాం
  • ప్రతి పార్టీ బందీల పట్ల మానవత్వం చూపాలి
  • ప్రస్తుత పరిణామాలను పాక్ పక్కనబెట్టాలి
భారత్ వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానం నేటి ఉదయం కూలిపోయింది. అయితే ఆ విమానం పైలెట్‌ను తమ బలాగాలు అదుపులోకి తీసుకున్నాయని పాక్ ప్రకటించడం మరింత సంచలనంగా మారింది. కష్ట సమయంలో ఆ వీర పైలెట్ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

‘ఈ కష్ట సమయంలో ఈ వీర పైలట్‌తో పాటు.. అతని కుటుంబం కోసం మేం ప్రార్థన చేస్తున్నాం. జెనీవా కన్వెన్షన్స్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం.. ప్రతీ పార్టీ బందీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. పాకిస్థాన్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో మానవత్వంతో మెలగాలని కోరుతున్నాం’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Asaduddin Owaisi
Pakistan
India
Twitter

More Telugu News