India: మసూద్ అజర్ ఇంట్లోకి చొచ్చుకెళ్లి అంతం చేసే శక్తి భారత్ కు ఉంది: మంత్రి అరుణ్ జైట్లీ

  • నాడు పాక్ లోనే లాడెన్ ని అమెరికా హతమార్చింది
  • భారత్ పై దాడి చేసే ఏ ఉగ్రవాదినీ వదిలిపెట్టబోం
  • మసూద్ అజర్ విషయంలో మేము ఆ పని చేయలేమా?
ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని, నాడు పాకిస్థాన్ లో ఉన్న లాడెన్ ని అమెరికా హతమార్చినట్టే, మసూద్ అజర్ ఇంట్లోకి చొచ్చుకెళ్లి అంతం చేసే శక్తి నేడు భారత్ కు ఉందని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఘంటాపథంగా చెప్పారు. భారత సైనిక సామర్థ్యంపై అటువంటి ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు లాడెన్ ను అమెరికా నావికాదళం ఏ విధంగా అయితే మట్టుబెట్టిందో, మసూద్ అజర్ విషయంలో కూడా తాము ఆ పని చేయలేమా? అని ప్రశ్నించారు. భారత్ పై దాడి చేసే ఏ ఉగ్రవాదిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. 
India
Pakistan
jaish e ahammad
masud
azar

More Telugu News