chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

  • పార్లమెంటు ఆవరణలో భేటీ కానున్న విపక్ష నేతలు
  • పుల్వామా, వాయుసేన దాడులపై చర్చించనున్న నేతలు
  • మహాకూటమి, ఈవీఎంలపై కూడా చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. అమరావతి నుంచి గన్నవరానికి హెలికాప్టర్ ద్వారా వచ్చిన ఆయన... అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంటు ఆవరణలో జరిగే విపక్ష నేతల సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ భేటీలో పుల్వామా ఉగ్రదాడి, పాక్ భూభాగంపై వాయుసేన దాడులపై నేతలు చర్చించనున్నారు. వీటిపై ఎలా స్పందించాలనే విషయంపై సమాలోచనలు చేయనున్నారు. దీంతోపాటు మహాకూటమి, ఈవీఎంలపై కూడా చర్చించబోతున్నారు. మరోవైపు, త్వరలో అమరావతిలో నిర్వహించనున్న ధర్మపోరాట దీక్షపై కూడా నేతలు చర్చించనున్నారు. 
chandrababu
delhi
Telugudesam
mahakutami

More Telugu News