indian air force: ఒకే సమయంలో వివిధ ఎయిర్ బేస్ ల నుంచి టేకాఫ్ అయిన యుద్ధ విమానాలు.. అర్థంకాక తలలు పట్టుకున్న పాక్ సైనికాధికారులు

  • మధ్య, పశ్చిమ కమాండ్ల ఎయిర్ బేసుల నుంచి టేకాఫ్ అయిన 12 విమానాలు
  • నిమిషాల వ్యవధిలోనే జట్టుగా తయారై... పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయిన వైనం
  • క్షణాల వ్యవధిలో పని కానిచ్చేసి, విజయవంతంగా తిరిగొచ్చిన భారత వాయుసేన
పాకిస్థాన్ ప్రధాన భూభాగంలోకి వెళ్లి టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసి వచ్చిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై సర్వత్ర ప్రశంసల జల్లు కురుస్తోంది. వాయుసేన దాడే చాలా అద్భుతంగా ఉందనుకుంటే... పాక్ సైనికాధికారులను మన ఎయిర్ ఫోర్స్ బోల్తా కొట్టించిన తీరు మరింత ఆసక్తికరంగా ఉంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం భారత్ లోని మధ్య, పశ్చిమ కమాండ్ల పరిధిలో ఉన్న వివిధ ఎయిర్ బేస్ ల నుంచి ఒకే సమయంలో 12 మిరేజ్ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఇవన్నీ ఎందుకు టేకాఫ్ అయ్యాయి? ఎక్కడకు వెళ్తున్నాయి? అనే విషయంలో పాక్ సైనికాధికారులు పూర్తిగా కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే నిమిషాల వ్యవధిలోనే ఇవన్నీ ఒక జట్టుగా కలసిపోయాయి. అనంతరం పాక్ భూభాగంలోకి నేరుగా చొచ్చుకెళ్లి క్షణాల వ్యవధిలోనే పని కానిచ్చేసి, విజయవంతంగా తిరిగొచ్చేశాయి. పాక్ ఎయిర్ ఫోర్స్ మన దాడిని ప్రతిఘటించే అవకాశాన్ని కూడా ఇవ్వకుండానే బాలాకోట్ లోని ఉగ్రతండాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది వరకు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని సమాచారం.
indian air force
pakistan
strikes

More Telugu News