vishaka: విశాఖలో వెంటనే రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి: పీయూష్ గోయల్ కు చంద్రబాబు లేఖ

  • నాలుగు డివిజన్లతో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి
  • విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్ ఏర్పాటు మా హక్కు
  • జోన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి
విశాఖ పట్టణంలో వెంటనే రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. వాల్తేర్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో జోన్ ఏర్పాటు చేయాలని, విభజన చట్టం ప్రకారం రైల్వేజోన్ ఏర్పాటు తమ హక్కు అని పేర్కొన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుకు నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేసిందని గుర్తు చేశారు. విశాఖ జోన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
vishaka
railway zone
railway minister
piyush

More Telugu News