khyber pakhtunkhwa: పాక్ ప్రధాన భూభాగంలోకి కూడా దూసుకుపోయి, టార్గెట్లను ధ్వంసం చేసిన వాయుసేన

  • పాక్ ప్రధాన భూభాగంలోకి కూడా వెళ్లిన భారత యుద్ధ విమానాలు
  • ఖైబర్ ఫక్తూంక్వాలో దాడులు చేసిన వాయుసేన
  • గ్రౌండ్ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దాడులు
ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నియంత్రణరేఖ ఆవల ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులను భారత వాయుసేన ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడే మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మన యుద్ధ విమానాలు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోకే కాకుండా పాకిస్థాన్ ప్రధాన భూభాగంలోకి కూడా వెళ్లి వచ్చాయి. ఖైబర్ ఫక్తూంక్వా భూభాగంలోకి వెళ్లిన మిరేజ్ జెట్స్.... అక్కడి లక్ష్యాలను కూడా ధ్వంసం చేశాయి. గ్రౌండ్ ఇంటెలిజెన్స్ విభాగం అందించిన లొకేషన్స్ ఆధారంగా ఈ దాడులు జరిగాయి. 
khyber pakhtunkhwa
mirage jets
pakistan
surgical strikes
air strikes
iaf

More Telugu News