Andhra Pradesh: వైఛీపీ మూకలు జనసేన కార్యకర్తలపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా!: నారా లోకేశ్

  • గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై దాడి
  • ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలు
  • ఈ చర్య సభ్యసమాజానికే సిగ్గుచేటన్న ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తలపై  నిన్న రాత్రి దాడి జరిగింది. కొందరు వ్యక్తులు జనసేన ప్రచార రథాలపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. తాజాగా ఈ దాడిని ఏపీ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. వైఛీపీ(వైసీపీ) మూకలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్య సభ్య సమాజానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘వై ఛీ పీ మూకలు గుంటూరు ఏటీ అగ్రహారంలో జనసేన కార్యకర్తల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా! మహిళలు అని కూడా చూడకుండా రాళ్లు రువ్వటం సభ్య సమాజానికే సిగ్గు చేటు !!’ అని ట్వీట్ చేశారు. ఈ దాడికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ కు జతచేశారు.
Andhra Pradesh
YSRCP
Jana Sena
Guntur District
attack
Nara Lokesh
Telugudesam
Twitter

More Telugu News