ముగిసిన కోడి రామకృష్ణ అంత్యక్రియలు....చితికి నిప్పంటించిన కుమార్తె దీపిక!
- జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
- అంతకుముందు ఫిలిం ఛాంబర్ కు భౌతికకాయం తరలింపు
- నివాళులు అర్పించిన అభిమానులు, సినీ ప్రముఖులు
గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోడి రామకృష్ణ గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున సహా పలువురు నటీనటులు, రాజకీయ నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కోడి రామకృష్ణ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.