Rahul Gandhi: భక్తులను పలకరిస్తూ.. వడివడిగా నడక.. తిరుమల చేరుకున్న రాహుల్!

  • అలిపిరి నుంచి తిరుమల చేరుకున్న రాహుల్
  • మధ్యలో భక్తులు, సహచరులను పలకరిస్తూ సాగిన పయనం
  • సాయంత్రం తిరుపతి సభలో పాల్గొననున్న కాంగ్రెస్ అధినేత
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తిరుమల కొండపైకి చేరుకున్నారు. అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమల చేరుకున్నారు. మార్గమధ్యంలో ఎక్కడా ఆగకుండా నడిచిన రాహుల్... కేవలం ఒక గంట ఏభై నిమిషాల్లో కొండపైకి చేరుకోవడం గమనార్హం. మధ్యలో భక్తులను, సహచరులను పలకరిస్తూ ఆయన నడిచారు. ఇక సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ నిర్వహించిన సభాస్థలిలోనే నేటి రాహుల్ సభ కూడా జరగనుంది.
Rahul Gandhi
tirumala
tirupati
congress

More Telugu News