ntr mahanayakudu: ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాపై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేశ్!

  • ఈ సినిమా ఓ కమనీయ దృశ్య కావ్యం
  • బాలా మావయ్యకు, చిత్ర యూనిట్ కు  అభినందనలు
  • ట్విట్టర్ లో స్పందించిన ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను చూశారు. అనంతరం స్పందిస్తూ.. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు ప్రజలకు ఈ సినిమా ఓ కమనీయ దృశ్య కావ్యమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మహానాయకుడు సినిమాలో హీరోగా నటించిన నందమూరి బాలకృష్ణతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

ఈరోజు లోకేశ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘ప్రజల్లోంచి పుట్టిన ఒక నాయకుడి ప్రయాణం, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి పాత్రలో బాలయ్య నటవిశ్వరూపం, వెరసి నందమూరి అభిమానులకు, తెలుగుప్రజలకు 'NTR మహానాయకుడు' చిత్రం ఒక కమనీయ దృశ్య కావ్యం. బాలా మావయ్యకు, చిత్ర బృందానికి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు.
ntr mahanayakudu
Tollywood
Twitter
Nara Lokesh
Telugudesam
Balakrishna

More Telugu News