'మహానాయకుడు'పై నారా బ్రహ్మణి స్పందన
- 'మహానాయకుడు'ను అద్భుతంగా ఆవిష్కరించారు
- తెలుగు వాళ్లంతా తప్పకుండా చూడాలి
- అమ్మానాన్నలకు అభినందనలు
తెలుగు జాతికి ఆయన ఎంతటి గౌరవాన్ని తీసుకొచ్చారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తోంది. మహోన్నతమైన ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్నీ, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రూపొందించిన ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారంతా చూడాలి. ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేసిన సందర్భంగా, నా తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.