ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల తొలగింపుపై వదంతులను నమ్మవద్దు!: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది
- ఎన్నికల నాటికి తప్పులను సరిదిద్దుతాం
- ఈ నెల 23,24న బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక క్యాంపును నిర్వహిస్తారు
- ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఈ నెల 23, 24 తేదీల్లో బూత్ స్థాయి అధికారులతో రాష్ట్రమంతటా ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నామని ద్వివేది తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫారం 6,7,8తో పాటు ఓటర్ జాబితాను అధికారులు తీసుకొస్తారని అన్నారు. ఏదైనా అనుమానాలు ఉన్నవారు, ఓటు నమోదు కానివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.