nagababu: 'జబర్దస్త్'లో చూడలేనంత వల్గారిటీ ఏమీ ఉండదు: నాగబాబు

  • చమ్మక్ చంద్ర స్కిట్స్ లో అడల్ట్ కామెడీ
  •  'జబర్దస్త్'లో ఎవరి స్టైల్ వారిది
  •  వాటితో పోలిస్తే 'జబర్దస్త్' నథింగ్  
 'జబర్దస్త్' కామెడీ షో ఎంతో పాప్యులర్ అయింది. ఈ షోకి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని వివాదాలు తలెత్తాయి కూడా. ఆ సమయంలో .. ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న నాగబాబును కూడా కొంతమంది విమర్శించారు. ఆ విమర్శలను గురించి తాజా ఇంటర్వ్యూలో నాగబాబు స్పందించారు.

'జబర్దస్త్'లో చమ్మక్ చంద్ర చేసే కొన్ని స్కిట్స్ లోనే కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుంది. ఆ తరహాలో నవ్వించడం చమ్మక్ చంద్ర స్టైల్. మిగతావారి స్కిట్స్ లో ఎక్కడా అసభ్యత అనేది కనిపించదు. వాళ్లంతా కూడా వాళ్ల స్టైల్లో స్కిట్స్ చేస్తూ వెళుతుంటారు. కొంతమంది విమర్శిస్తున్నట్టుగా 'జబర్దస్త్' చూడలేనంత భయంకరమైన షో ఏమీ కాదు. అసభ్యతగా అనిపించే కార్యక్రమాలు .. థియేటర్లకు వచ్చే బూతు సినిమాలు చాలానే ఉంటున్నాయి. వాటితో పోలిస్తే 'జబర్దస్త్'లో చూపించేది నథింగ్" అంటూ తేల్చి చెప్పారు. 
nagababu

More Telugu News