japur: జైపూర్ జైల్లో పాకిస్థానీని కొట్టి చంపిన తోటి ఖైదీలు

  • జైపూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న పాకిస్థానీ
  • తోటి ఖైదీలతో గొడవపడ్డ పాక్ జాతీయుడు
  • కొట్టి చంపిన ఇతర ఖైదీలు
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న సెంట్రల్ జైల్లో దారుణ ఘటన సంభవించింది. జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఒక పాకిస్థాన్ వ్యక్తిని తోటి ఖైదీలు కొట్టి చంపారు. జైలు అధికారుల వివరాల ప్రకారం... తోటి ఖైదీలతో పాకిస్థాన్ ఖైదీ గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇతర ఖైదీలు అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ క్రమంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. హత్య విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
japur
central jail
pakistan
national
prisoner
murder

More Telugu News