Pakistan: భారత్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి: అకౌంట్ బ్లాక్ చేసిన ట్విట్టర్

  • జమ్ముకశ్మీర్ లో భారత ప్రభుత్వం దురాగతాలకు పాల్పడుతోందంటూ వ్యాఖ్యలు
  • కుల్ భూషన్ కేసుపై కూడా తప్పుడు వ్యాఖ్యలు
  • ట్విట్టర్ కు ఫిర్యాదు చేసిన భారత్
పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. అతని అకౌంట్ ను స్తంభింపజేసింది. వివరాల్లోకి వెళ్తే, జమ్ముకశ్మీర్ లో భారత ప్రభుత్వం దురాగతాలకు పాల్పడుతోందంటూ ట్విట్టర్ లో ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు అంతర్జాతీయ కోర్టులో విచారణలో ఉన్న కుల్ భూషణ్ కేసుపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్ కు భారత్ ఫిర్యాదు చేసింది. దీంతో ఫైజల్ ఖాతాను ట్విట్టర్ రద్దు చేసింది. అభ్యంతర వ్యాఖ్యలు పెట్టినందుకే ఫైజల్ ఖాతాను ట్విట్టర్ తొలగించిందని అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా వార్త ప్రచురించాయి.
Pakistan
foreign ministry
spokes person
faisal
Twitter
block

More Telugu News