DL Ravindra Reddy: నేడు చంద్రబాబుతో డీఎల్ భేటీ... రేపోమాపో పచ్చ కండువా!

  • మైదుకూరు టికెట్ ను ఆశిస్తున్న డీఎల్
  • ఈ సాయంత్రం చర్చలు
  • ఆపై స్పష్టత వచ్చే అవకాశం
నేడు ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ మంత్రి, రాయలసీమ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి చర్చలు జరపనున్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన రానున్న ఎన్నికల్లో మైదుకూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దగ్గర ప్రస్తావించి, టికెట్ కన్ఫర్మ్ అయితే, ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని సమాచారం.

కాగా, మైదుకూరు స్థానాన్ని తనకు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబడుతున్నారు. అయితే, ఆయనకు ఇప్పటికే ఓ ప్రతిష్ఠాత్మకమైన పదవి ఉండటం, ఆ ప్రాంతంలో డీఎల్ కు మంచి పట్టు ఉండటంతో ఈ సీటు ఆయనకే లభిస్తుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. సాయంత్రం చంద్రబాబు, డీఎల్ మధ్య చర్చలు జరగనుండగా, ఈ భేటీ తరువాత మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
DL Ravindra Reddy
Chandrababu
Telugudesam
Maidukur

More Telugu News