టీడీపీకి జ్ఞానోదయం కలిగింది.. వైసీపీ మోసం చేస్తోంది: రఘువీరా
- ఎస్వీ యూనివర్శిటీ మైదానంలో రాహుల్ సభ నిర్వహిస్తాం
- మోదీ ద్రోహం చేసిన చోట రాహుల్ భరోసా ఇస్తారు
- మోదీని వైసీపీ కనీసం ప్రశ్నించడం కూడా లేదు
ప్రత్యేక హోదాపై పార్లమెంటు సాక్షిగా సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ మోసం చేస్తోందన్న జ్ఞానోదయం టీడీపీకి కలిగిందని, అందుకే కాంగ్రెస్ తో చేయి కలిపిందని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోదీని వైసీపీ కనీసం ప్రశ్నించడం కూడా లేదని... హోదాపై సంతకం చేసే వారికే తమ మద్దతు అంటూ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు ఉందని... ఏపీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.