Chandrababu: సినీ ప్రముఖులు నేరగాళ్లతో కలవడం ఏంటి?: జగన్ తో నాగార్జున భేటీపై చంద్రబాబు

  • నిన్న వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన నాగార్జున
  • ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చంద్రబాబు
  • సినీ పరిశ్రమకు అండగా నిలబడివున్నామన్న ఏపీ సీఎం
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ఇంటికి నిన్న వెళ్లిన టాలీవుడ్ హీరో నాగార్జున, ఆయనతో గంటపాటు భేటీ అవడాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. ఈ ఉదయం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న వేళ, ఓ నేత నాగార్జున, జగన్ ల భేటీ గురించి ప్రస్తావించిన వేళ, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నేరస్థులతో సినీ నటులు భేటీ కావడం దురదృష్టకరమన్న ఆయన, ఇటువంటి భేటీలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో అండగా నిలబడుతోందని, అభివృద్ధికి అండగా అందరూ నిలవాల్సిన సమయంలో పరిశ్రమ ప్రముఖులు నేరగాళ్లతో కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పనిచేస్తున్న వారికి దీవెనలు ఇవ్వాలని, వారికి మద్దతిచ్చి ప్రోత్సహించాలని సూచించారు.
Chandrababu
Nagarjuna
Jagan

More Telugu News