nayanatara: నయనతార ప్రధాన పాత్రధారిగా 'ఐరా' .. విడుదల తేదీ ఖరారు

  • నాయిక ప్రాధాన్యత గల కథగా 'ఐరా'
  • విభిన్నమైన పాత్రల్లో నయనతార
  • మార్చి 28న తమిళవెర్షన్ రిలీజ్  
చాలాకాలం నుంచి నయనతార తనదైన స్టైల్లో దూసుకుపోతోంది. ఒక వైపున సీనియర్ హీరోల సరసన నటిస్తూనే .. మరో వైపున యువ కథానాయకులతో జోడీ కడుతోంది. ఇక నాయిక ప్రాధాన్యత కలిగిన విభిన్నమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. ఇలా అన్ని వైపుల నుంచి నయనతార తన జోరును కొనసాగిస్తూ ఫుల్ బిజీగా వుంది.

తమిళంలో ఆమె తాజా చిత్రంగా 'ఐరా' రూపొందుతోంది. ఈ సినిమాలో ఆమె రెండు విలక్షణమైన పాత్రల్లో నటిస్తుండటం విశేషం. ఈ అంశమే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తమిళంలో ఈ సినిమా విడుదలకి ముహూర్తం ఖరారైపోయింది. మార్చి 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. త్వరలోనే తెలుగు వెర్షన్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. నయనతారకి ఈ సినిమా మరో భారీ విజయాన్ని అందించడం ఖాయమనే మాట కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.
nayanatara

More Telugu News