పుల్వామా దాడి తమ పనేనంటూ రెండో వీడియోను విడుదల చేసిన జైషే
- పుల్వామా దాడితో తమకు సంబంధం లేదన్న పాక్ ప్రధాని
- ఎప్పుడు కావాలంటే అప్పుడు దాడి చేస్తామంటూ మరో వీడియో విడుదల
- భారత్‌కు దొరికిన మరో ఆయుధం
ఈ నెల 14న సెలవులు ముగించుకొని జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు. దాడి తమపనేనంటూ కాసేపటికే జైషే మహ్మద్ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు రెండో వీడియోను విడుదల చేసింది.