Rai Lakshmi: 'మీటూ' ముగిసింది, పరిస్థితి ఏమీ మారలేదు: రాయ్ లక్ష్మి

  • చప్పబడిన 'మీటూ' ఉద్యమం
  • కొందరు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించారు
  • ఫేమస్ కావడానికి అబద్ధాలు చెప్పారన్న రాయ్ లక్ష్మి 
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై గత సంవత్సరం ఉవ్వెత్తున ఎగసిన 'మీటూ' ఉద్యమం ఇప్పుడు చప్పబడింది. దీని గురించి మాట్లాడుతున్న వారు, ఆరోపణలు చేస్తున్న వారూ ఎవరూ లేరు. ఇక ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మి, 'మీటూ' ఉద్యమం వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించానని, అయితే, దురదృష్టవశాత్తూ ఎటువంటి మార్పులూ చోటు చేసుకోలేదని చెప్పింది.

కొందరు ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తూ, తీవ్రతను తగ్గించారని ఆరోపించింది. ఫేమస్ కావడానికి మరికొందరు 'మీటూ' అంటూ మీడియా ముందుకు వచ్చారని, తనకు బ్రేక్ ఇవ్వలేదంటూ మరికొందరు మాట్లాడారని, ఎవరు నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో ఇండస్ట్రీలోని వారికే తెలియదని వ్యాఖ్యానించింది. దీంతో ఫలితాలు గొప్పగా ఏమీ రాలేదని, ఇండస్ట్రీతో సంబంధం లేని ప్రజలు అసలు దీని గురించే మరిచిపోయారని రాయ్ లక్ష్మి పేర్కొంది.
Rai Lakshmi
MeToo India
Casting Couch

More Telugu News