Revanth Reddy: అందుకే తుమ్మల ఔట్... కడియంను ఎందుకు తీసుకోలేదో అర్థమే కావట్లా: రేవంత్ రెడ్డి

  • కేటీఆర్ ను 'రామూ' అని పిలిచిన తుమ్మల
  • అందుకే శాశ్వతంగా మాజీ అయిపోయారు
  • మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి
తన కేబినెట్ లో అసమర్థులకు మాత్రమే కేసీఆర్‌ చోటు కల్పిస్తారని తాను ముందుగానే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందని కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, కేటీఆర్ ను 'రామూ' అని పిలిచినందుకే తుమ్మల నాగేశ్వరరావు శాశ్వతంగా మాజీ అయిపోయారని అన్నారు.

ఎంతో సీనియర్ అయిన కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావట్లేదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అవినీతి వెనుకా కేసీఆర్, కేటీఆర్ హస్తముందని చెప్పారు. జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి 40 మందికి పైగా జవాన్లను హత్యచేసినా, స్పందించేందుకు, వారికి నివాళులు అర్పించేందుకు కేసీఆర్ కు సమయం లేకపోయిందని విమర్శించారు.
Revanth Reddy
KTR
Tummala
Kadiam Srihari

More Telugu News