‘బొంగులో చికెన్’కు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం
- అరకు ప్రాంతపు ప్రత్యేక వంటకం బొంగులో చికెన్
- 105 నిమిషాల్లో 15 అడుగుల బొంగులో తయారీ
- ఏపీ సర్కార్, టూరిజం శాఖ, మ్యారియట్ హోటల్, విశాఖ ఆధ్వర్యంలో ఇది తయారీ
అంతకు ముందు, మ్యారియట్ హోటల్ చెఫ్ రూపేశ్ మీడియాతో మాట్లాడుతూ, అరకుకు చెందిన ఈ వంటకం చాలా ప్రత్యేకమైందే కాదు, పురాతనమైంది కూడా అని అన్నారు. వంట చేసేందుకు ఎటువంటి పాత్రలు లేని కాలంలో బొంగులో మాంసాన్ని ఉంచి ఈ వంటకాన్ని తయారు చేసుకునేవారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం, టూరిజం శాఖ, మ్యారియట్ హోటల్, విశాఖపట్టణం ఆధ్వర్యంలో భారీ వెదురు బొంగులో ఈ చికెన్ ని తయారు చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు.
ఈ వంటకం తయారు చేసేందుకు రెండు గంటల సమయం పడుతుందని, పచ్చి వెదురు బొంగులో ఈ మాంసాన్ని ఉంచి బొగ్గులపై దీనిని కాలుస్తామని చెప్పారు. ఒక ఆంధ్రా వంటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకొచ్చిందని చెప్పారు.