మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను
- జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భమ్ లో ఘటన
- బలగాలు, మావోల మధ్య ఎదురుకాల్పులు
- బుల్లెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టు
ఈ సందర్భంగా మావోయిస్టులను చుట్టుముట్టిన బలగాలు వారిని లొంగిపోవాలని కోరాయి. కానీ, మావోలు మందుపాతరను పేల్చి, కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించారు. దీంతో, బలగాలు కూడా ఎదురుకాల్పులను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో, కాల్పులు జరిగిన స్థలంలో బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడ్డ మహిళా మావోయిస్టును బలగాలు గుర్తించాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్త దానం చేశారు.