పాకిస్థాన్ కు షాకిచ్చిన ముఖేష్ అంబానీ... పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న ఐఎంజీ-రిలయన్స్!
- పీఎస్ఎల్ కు ప్రొడక్షన్ పార్టనర్ గా ఉన్న ఐఎంజీ-రిలయన్స్
- వాణిజ్య సంబంధాలు పెట్టుకోరాదని నిర్ణయం
- లీగ్ కు భాగస్వామిగా తప్పుకున్నామని ప్రకటన
కాగా, పీఎస్ఎల్ తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఐఎంజీ - రిలయన్స్ పలు మ్యాచ్ ల లైవ్ కవరేజ్ కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సివుంది. వివిధ దేశాల్లోని టీవీ చానళ్లకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్ లు వంటి ఇతర మౌలిక వసతులను కల్పించాల్సివుంది. ఇండియాలో పీఎస్ఎల్ పోటీలు 2017లో డిస్కవరీ ఛానల్ ప్రారంభించిన డీ-స్పోర్ట్ చానల్ లో ప్రసారం అవుతుంటాయి. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్థాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది.