KCR: రేపే కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. చాన్స్ వీరికేనంటూ లీకులు!

  • ఎట్టకేలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ
  • ఆశగా ఎదురుచూస్తున్న నేతలు
  • లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోమారు విస్తరణ
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత రేపు (మంగళవారం) కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నారు. దీనికి సీఎం ముహూర్తం ఫిక్స్ చేసినప్పటి నుంచి ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈసారి కేబినెట్‌లో టీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్, ఈటలకు చోటు దక్కకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా బయటకొచ్చిన లీకుల ప్రకారం..
 
ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి, జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌‌లకు కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్‌ను నియమించే అవకాశం ఉంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో అవి ముగిశాక కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం. అలాగే, ఎస్టీ కోటా నుంచి ఒకరికి, ఓ మహిళకు ఈసారి చాన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
KCR
Telangana
Cabinet
KTR
Harish Rao
Talasani
Assembly

More Telugu News