Jagan: జగన్ మాటల్లో ఏమన్నా అర్థం ఉందా? రెండేళ్ల క్రితమే దానిని మూసేశాం: కేశినేని నాని

  • జగన్ మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు
  • కేశినేని ట్రావెల్స్‌ను మూసేసి రెండేళ్లు అయింది
  • జగన్ అవగాహన రాహిత్యానికి పరాకాష్ట
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని ఫైరయ్యారు. ఏలూరు బీసీ గర్జన సభలో జగన్ మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదని, అన్నీ బోగస్ అని మండిపడ్డారు. కేశినేని ట్రావెల్స్‌ను మూసేసి రెండేళ్లు అయిందన్న విషయం కూడా జగన్‌కు తెలియదన్నారు. ఇప్పుడు ఆర్టీసీని నిర్వీర్యం చేసి కేశినేని ట్రావెల్స్‌కు కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పడం జగన్ అవగాహన రాహిత్యానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.

బీసీ గర్జన సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నట్టు నాని చెప్పారు. ప్రతిపక్షనేత ఇప్పుడు ఇస్తున్న హామీలను తాము ఇప్పటికే అమలు చేసి చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గొల్లపూడిలో నిర్వహించిన టీడీపీ నేతల బీసీ సోదరుల ఆత్మీయ సదస్సులో నాని ఈ వ్యాఖ్యలు చేశారు.  
Jagan
YSRCP
Telugudesam
Kesineni Nani
Vijayawada
Andhra Pradesh

More Telugu News